పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతా రెడీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతా రెడీ అయ్యింది. బుధవారం (జూలై-18) నుంచి ఆగస్టు 10 వరకు సమావేశాలు జరగనున్నాయి. పెండింగ్ లో ఉన్న ట్రిపుల్ తలాక్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించే ప్రయత్నాల్లో ఉంది కేంద్రం. వీటితోపాటు.. పెండింగ్ లోని ఇతర బిల్లులు , కొత్త బిల్లులను సభకు తీసుకురానుంది.

బుధవారం ఉదయం ప్రారంభం కానున్న సమావేశాలు ఆగస్టు 10 వరకు కొనసాగుతున్నాయి. మొత్తం 24 రోజుల్లో 18 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో మొత్తం 46 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు చర్చకు రానున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ ప్రకటించారు. కొన్ని బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు గత రెండు సెషన్ల నుంచి పెండింగ్ లో ఉంది. లోక్ సభలో పాసైనా.. రాజ్యసభలో విపక్షాలు అడ్డుతగలడంతో బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. దీనిని ఎలాగైనా పాస్ చేయించాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఆరు ఆర్డినెన్స్ ల స్థానంలో బిల్లులు లోక్ సభకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

ఫుజిటీవ్ ఎకానమిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్, క్రిమినల్ లా చట్టసవణ ఆర్డినెస్స్, కమర్షియల్ కోర్టులు, కమర్షియల్ డివిజన్, అప్పీలేట్ డివిజన్ హైకోర్టుల చట్టసవరణ ఆర్డినెన్స్- 2018, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ చట్టసవరణ ఆర్డినెన్స్, నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆర్డినెన్స్, ఇన్సాల్వెన్సీ, బ్యాంకప్ట్రీ కోడ్ చట్టసవరణ ఆర్డినెన్స్ లను సభలో ప్రవేశపెట్టనుంది. ఇవి కాకుండా మరికొన్ని కొత్త బిల్లులు సభకు తీసుకురానుంది కేంద్రం. ఎయిర్ పోర్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టసవరణ బిల్లు, నియంత్రణ లేని డిపాజిట్ స్కీంల నిషేద బిల్లు, మానవహక్కుల పరిరక్షణ చట్టసవరణ బిల్లు, చిన్నమధ్యతరహా పరిశ్రమల అభివృద్ది చట్టసవరణ బిల్లు, ఆటిజంతో బాధపడుతున్న వారికోసం జాతీయట్రస్టు ఏర్పాటు చట్టసవరణ బిల్లు, డ్యాం సేఫ్టీ బిల్లు, మానవ అక్రమరవాణా నిరోధక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.

అలాగే CGST, IGST చట్టసవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం.  రాజ్యసభలో పది బిల్లుల వరకు పెండింగ్ లో ఉన్నాయి. విజిల్ బ్లోయర్స్ రక్షణ బిల్లు 2015, పరిశ్రమల బిల్లు 2016, వెనకబడిన తరగతలు జాతీయకమిషన్ ఉపసంహరణ బిల్లు 2017, స్థిరాస్థి సేకరణ చట్టసవరణ బిల్లు, మోటార్ వెహికల్ చట్టసవరణ బిల్లు, అవినీతి నిరోధక బిల్లులు రాజ్యసభలో ఆగిపోయాయి. వీటిపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Posted in Uncategorized

Latest Updates