పాలమూరులో 20లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాకే మళ్లీ ఓట్లడుగుతా : KCR

వనపర్తి : తెలంగాణ బాగుకోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేయించానని వనపర్తి సభలో చెప్పారు సీఎం కేసీఆర్. మన నీళ్లు.. ఎట్లవాడుకోవాలి … ఎలా మళ్లించాలి.. ఎలా ఆంధ్రదోపిడీని అడ్డుకోవాలని ఆలోచన చేశానన్నారు. 40మంది రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లను 3రోజులు హెలికాప్టర్లలో తిప్పి… కృష్ణా, తుంగభద్ర, గోదావరి ఉపనదులపై సమీక్ష జరిపించి వారి రిపోర్టుల ఆధారంగా.. కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ తో ప్రాజెక్టు రీడిజైన్లు చేయించానని చెప్పారు.

మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చాకే మళ్లీ ఓట్లకు పోతున్నామని చెప్పిన కేసీఆర్.. పాలమూరులో 20లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. పాలమూరు లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తిచేసి… మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం అన్నారు. మొత్తం 20లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పాలమూరులో ఓట్లు అడగనని అన్నారు.

పచ్చ బడ్డ పాలమూరులోనే ఓట్లడుగుతా అన్నారు. ఇతర జిల్లాల వాళ్లు పాలమూరు జిల్లాకు కూలీ పనికోసం రావాలన్నారు. వలసల జిల్లా… కూలీల జిల్లా.. కరువు జిల్లా పేరు రూపుమాపుతానని అన్నారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates