పాలమూరు కాంగ్రెస్ లో విబేధాలు : TRSలోకి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

DAMODAR KUCHUKUNTLAపాలమూరు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, MLC కూచుకుంట్ల దామోదర్ రెడ్డి శనివారం (జూన్-9) సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో TRS లో చేరనున్నారు. దామోదర్ రెడ్డితో పాటు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎడ్మ క్రిష్ణారెడ్డి, డాక్టర్ అబ్రహం కూడా TRS గూటికి చేరబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూచుకుంట్ల దామోదర్ రెడ్డి సీనియర్ నేత. వచ్చే ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. BJP నుంచి మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దామోదర్ రెడ్డికి ఇష్టం లేదు. 2019 ఎన్నికల్లో నాగర్ కర్నూలు టిక్కెట్ దక్కుతుందని ఆశతో ఉన్న దామోదర్ రెడ్డికి నాగం రాక ఇబ్బందిగా మారింది.

శుక్రవారం (జూన్-8) జానారెడ్డి ఇంట్లో జరిగిన CLP సమావేశానికి కూడా కూచుకుంట్ల దూరంగా ఉన్నారు. 3,4 రోజుల క్రితం PCC చీఫ్ ఉత్తమ్ ఆయనతో మాట్లాడారు. దామోదర్ రెడ్డి పార్టీ వీడిపోరని ఉత్తమ్ కూడా చెప్పారు. గురువారం (జూన్-7) జిల్లాకు చెందిన మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ స్వయంగా దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించారు. ఆమె కూడా నాగం పార్టీలో చేరడంతోనే దామోదర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పార్టీ ముఖ్య నేతలు దీనిపై ఆయనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. నాగం పార్టీలో చేరకముందే దామోదర్ రెడ్డితో చర్చించాల్సిందన్నారు.  అయినా దామోదర్ రెడ్డి పార్టీని మాత్రం వీడరని డీకే అరుణ చెప్పారు. మొదటి నుంచి కూచుకుంట్ల డీకే అరుణ వర్గం నేతగా ముద్రపడ్డారు. చివరకు ఆమె చెప్పినా.. దామోదర్ రెడ్డితో చర్చలు జరిపినా ఫలించలేదు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates