పాలస్తీనాతో స్నేహానికి ఇది ఓ చిహ్నం : మోడీ

MMOపాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. శనివారం (ఫిబ్రవరి-10) గ్రాండ్ కాలర్ ఆఫ్ పాలస్తీనా మెడల్ తో మోడీని.. అబ్బాస్ ఘనంగా సత్కరించారు. ప్రధాని నాయకత్వ లక్షణాన్ని గుర్తించి ఈ ప్రదానం చేసినట్టు ఓ ప్రశంసాపత్రాన్ని కూడా అందించారు.

ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను అభివృద్ధి చేసేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు దక్కింది. తర్వాత.. ద్వైపాక్షిక చర్చలు చేసిన మోడీ, అబ్బాస్.. కీలక ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. ఇది భారతదేశానికి గౌరవం, పాలస్తీనాతో స్నేహానికి ఇది ఓ చిహ్నం అన్నారు. ప్రతి భారత పౌరుడి తరుపున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.

Posted in Uncategorized

Latest Updates