పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న అమితాబ్

Amitabh_Bachchan_December_2013రాజకీయాల్లోకి వచ్చేందుకు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. తమిళనాడులో కమల్ హాసన్ ఇప్పటికే పార్టీని అనౌన్స్ చేయగా.. రజనీకాంత్ కూడా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతకు ముందు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. అందులో కొంత మంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరికొంత మంది సినిమాల్లో సూపర్ స్టార్లు అయినా.. రాజకీయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా ఉండే అమితాబ్.. ఈ మధ్య ట్విట్టర్ లో రూట్ మార్చారు. రీసెంట్ గా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ నేతలను ఫాలో అవుతున్నారు. రాహుల్ గాంధీ, మరికొంత మంది ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను, చిదంబరం, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, సచిన్ పైలట్, సీపీ జోషిని ఫాలో అవడం ప్రారంభించారు.

ట్విట్టర్ లో అమితాబ్ కు 3 కోట్ల 30 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన ఫాలో అయ్యేది కేవలం 1 వెయ్యి 730 మంది మాత్రమే. వారిలో చాలా మంది కాంగ్రెస్ నేతలున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవుతున్నందుకు బిగ్ బికి థ్యాంక్స్ చెప్పారు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ. అయితే.. ఇతర పార్టీల నేతలను కూడా కొంత మందిని ఫాలో అవుతున్నారు బిగ్ బీ. RJD చీఫ్ లాలూ ప్రసాద్ , ఆయన కూతురు మిశా భారతి, నితీష్ కుమార్ , ఒమర్ అబ్దుల్లా, సీతారాం ఏచూరీ, ఆప్ లీడర్లు మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ లతో పాటు ఇంకొంత మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లను, కేటీఆర్, జగన్, లోకేశ్ లాంటి నేతల అకౌంట్లను కూడా అమితాబ్ ఫాలో అవుతున్నారు.

బోఫోర్స్ స్కాం ముందు వరకు గాంధీలతో చాలా సన్నిహితంగా ఉండేవారు అమితాబ్. రాజీవ్ గాంధీతో ఆయనకు సాన్నిహిత్యం చాలా ఎక్కువ. రాజీవ్ హయాంలో రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉండేవారు. కానీ బోఫోర్స్ స్కాంలో అమితాబ్ కు కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావడంతో, గాంధీ పరివార్ తో ఆయనకున్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ టీమ్ లో కీలక సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేతలను అమితాబ్ ఫాలో అవుతుండడం ఇంట్రస్టింగ్ గా మారింది.

Posted in Uncategorized

Latest Updates