పాలేరులో తుమ్మల ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన లీడింగ్, ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి 1980 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున తుమ్మల, ప్రజాకూటమి తరపున కందాల ఉపేందర్ రెడ్డి, బీజేపీ నుంచి కొండవల్లి శ్రీధర్ రెడ్డి, సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి పోటీ చేశారు. పాలేరు నియోజవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.

Posted in Uncategorized

Latest Updates