పాల్వంచ KTPS ఏడోదశ విద్యుదుత్పత్తి ప్రారంభం

POWERపాల్వంచ KTPS  ఏడో దశలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 800 మెగా వాట్ల సామర్థ్యం గలిగిన ఈ ప్లాంట్ లో… జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుదుత్పత్తిని ప్రారంభించి… పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు. BHEL ఉన్నతాధికారులతో పాటు జెన్ కో అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెలరోజుల పాటు ట్రయల్ రన్ తర్వాత… జులై చివరి వారం నుంచి రెగ్యులర్ గా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కమెన్స్ ఆపరేషన్ డేట్ ప్రణాళికను తయారు చేశారు. ప్రత్యేక  రాష్ట్రం వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా KTPS  7వ దశ రికార్డుల్లోకెక్కింది.

5వేల 700 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంటును నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడంపై జెన్ కో అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.

Posted in Uncategorized

Latest Updates