పాస్‌పోర్టు వెరిఫికేషన్ లో తెలంగాణ నెంబర్ వన్ : డీజీపీ

DPG passportపాస్‌పోర్టు వెరిఫికేషన్ లో రాష్ట్ర పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. టెక్నాలజీలో నూతన విధానాలను తీసుకొచ్చామన్నారు. మంగళవారం(జూన్-26) పాస్ పోర్టు సేవా దివస్ సందర్భంగా పాస్ పోర్టు వెరిఫికేషన్, జారీలో అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ చేతులమీదుగా డీజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీలో అవార్డు అందుకున్నారు.

అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కేవలం 4 రోజుల్లోనే పాస్‌పోర్టు పరిశీలిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాస్‌పోర్టు తీసుకోవడం సులభతరం చేశామన్నారు. పాస్‌పోర్టుకు సంబంధించి ‘వెరీ ఫాస్ట్’ యాప్ మూడేళ్లుగా వాడుతున్నట్లు చెప్పారు. పాస్‌పోర్ట్ అధికారులకు రేటింగ్ కూడా ఇస్తున్నామన్నారు. పోలీసుల పరిశీలన తర్వాత వినియోగదారుల సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ నాణ్యమైన సేవలు అందించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates