పాస్ బుక్స్, చెక్కుల పంపిణీ సజావుగా నిర్వహించండి: సీఎస్

csజిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు సరికొత్త వ్యూహంతో జిల్లాల్లో పర్యటించి రైతులకు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీకి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం(మే-25) సెక్రటేరియట్ లో జిల్లాలలో పట్టాదారు పాసుపుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ పై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేక అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు CS జోషి. మండల అధికారుల టీంలు.. ప్రతి గ్రామంలో పర్యటించేలా చూడాలన్నారు. పాసుపుస్తకాలలోని తప్పులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని సరిదిద్దేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలకు కేటాయించిన మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ తో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాలలో ఏర్పడిన సమస్యను అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులపై సమీక్షించాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 57.33 లక్షల ఖాతాలు క్లియర్ గా ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల పాసుపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాల్లో మిగిలిన పాసు పుస్తకాల పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్ సిగ్నేచర్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే  ప్రింట్ చేసిన పాసుపుస్తకాలలో తప్పులు వచ్చాయని…. వీటిని సరిదిద్దే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జూన్ 20 వరకు ఈ కార్యక్రమం పూర్తి అయ్యేలా చూడాలన్నారు సీఎస్ జోషి.

Posted in Uncategorized

Latest Updates