పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం సంధ్యగారు : జీవిత రాజశేఖర్

pow--sandhyaతన కుటుంబంపై ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్(POW) నేత సంధ్య చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు సినీ నటి జీవితా రాజశేఖర్. నిరాధార ఆరోపణలు చేయడంపై  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అందే కాదు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకొనేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎవరి కోసం.. ఎందు కోసం ఈ పోరాటం జరుగుతుందోనన్న చర్చ ఆందోళనకరంగా ఉందన్న జీవిత… ఓ ఛానల్‌లో సామాజిక కార్యకర్త సంధ్య తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. రాజశేఖర్‌కి అమీర్‌పేట్ హాస్టల్ అమ్మాయిలను పంపిస్తానని ఆరోపించడం ఎంతవరకు సబబు అని ఆమె అన్నారు. ఓ మహిళ గురించి.. మరో మహిళ ఆరోపణలు… చేస్తుంటే ఆ యాంకర్ ఆమెను ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు జీవితా రాజశేఖర్.

Posted in Uncategorized

Latest Updates