పిచ్చి నమ్మకం : హెచ్ఐవీ ఉందంటూ.. నీళ్లను తోడేస్తున్నారు

కర్ణాటకలోని హుబ్లీ జిల్లా మోరాబ్ గ్రామ చెరువులో హెచ్ఐవీ వైరస్ కలిసిందంటూ నీటిని తాగటం మానేసారు గ్రామస్తులు. దీంతో చెరువులోని నీటినంతటిని తోడేసి వేరేనీటిని నింపేందుకు సిద్ధమయ్యారు అధికారులు.  నంబర్ 29న 20 ఏళ్ల వయసున్న హెచ్ఐవీ వ్యాధిగ్రస్తురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గత వారం ఆమె మృతదేహం నీటిపై తేలియాడడంతో గ్రామస్తులు గమనించి.. పోలీసులకు సమాచారమిచ్చారు.

అప్పటికే.. మృతదేహాన్ని చేపలు సగం తినేశాయి. ఆత్మహత్య చేసుకున్న యువతికి ఏయిడ్స్ ఉండడంతో.. చెరువులోని నీరు హెచ్ఐవీ తో కలుషితమైందని గ్రామస్తులు నీటిని తాగడం మానేశారు.  వారి డిమాండ్ మేరకు అధికారులు చెరువులోని నీటిని మోటార్ పంపుల ద్వారా బయటకు తోడేస్తున్నారు. కొత్త నీటిని చెరువులోకి పంపిన తర్వాత తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ విషయం పై రాజీవ్ గాంధీ ఛాతీ వైద్యశాలకు చెందిన డాక్టర్ నాగరాజు స్పందించారు. చెరువులోని నీటిలో హెచ్‌ఐవీ వైరస్ కలిసిందని నమ్మడం సరికాదని అన్నారు. హెచ్‌ఐవీ వైరస్ ఎనిమిది గంటల కంటే ఎక్కువ బతకదని తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి ఆరు రోజులు అవుతుంది కాబట్టి.. చెరువులోని నీటిలో హెచ్‌ఐవీ వైరస్ ఉండదని డాక్టర్  చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates