పిటీషన్ కొట్టివేత : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్

SUPREMకాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైన్ క్లియరైంది. పర్యావరణ  అనుమతులపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం  (ఫిబ్రవరి-23) సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాళేశ్వరానికి  పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ.. హయతుద్దీన్ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు  చేశారు. వాదనలు విన్న కోర్టు.. చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీకి ఎందుకొచ్చారని  పిటిషనర్ ను ప్రశ్నించింది. నిర్ణీత సమయంలో కోర్టుకు ఎందుకు హాజరుకాలేదని  నిలదీసింది. ప్రాజెక్టుకు అనుమతులు కరేక్టేనని తేల్చిచెప్పింది. పిటిషన్ ను కొట్టివేసింది.

 

Posted in Uncategorized

Latest Updates