పిట్ట కొంచెం.. మోత ఘనం

అర్జెంటీనాలో జరుగుతున్న యూత్ ఒలిపింక్స్ లో ఇండియన్ యంగ్ వెయిట్ లిఫ్టర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 15 ఏళ్ల జెరెమీ లాల్రిన్గుంగా గ్రూప్-Aలో 62 కేజీల విభాగంలో మొత్తంగా 274 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.

ఫస్ట్.. స్నాచ్ విభాగంలో  124 కేజీలను లిఫ్ట్ చేసిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్ లో అత్యధికంగా 150 కేజీలను లిఫ్ట్ చేశాడు. దీంతో టర్కీ వెయిట్ లిఫ్టర్ తొప్తాస్ కానర్(263 కేజీలు) ను బీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. యూత్ ఒలింపిక్స్ లో ఇండియాకు ఇదే ఫస్ట్ గోల్డ్ మెడల్.

Posted in Uncategorized

Latest Updates