పిడికిలి బిగించారు : ప్రైవేట్ స్కూల్ టీచర్స్ బంద్

ప్రైవేట్ స్కూల్ టీచర్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12వేల ప్రైవేట్ స్కూల్స్ లో జూలై 18వ తేదీ బుధవారం విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చింది తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (TPTF). ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఉద్యోగ భద్రత కోరుతున్నాయి. ముఖ్యంగా జీవో ఎంఎస్ నెంబర్ 1, 1994 ప్రకారం.. అన్ని ప్రైవేట్ స్కూల్స్ విధిగా టీచర్లకు యాక్సిడెంట్ ఇన్యూరెన్స్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం అమలు కావటం లేదు. ఈ నిబంధన అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రైవేట్ టీచర్ల డిమాండ్లు ఇలా ఉన్నాయి :

… 50 ఏళ్లు నిండిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్ ఇవ్వాలి.

… ప్రైవేట్ స్కూల్ టీచర్లకు గుర్తింపు కార్డుతోపాటు ESI, PF సదుపాయం కల్పించాలి.

… జీతాలు బ్యాంక్ ద్వారానే చెల్లించాలి.

… టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి

… అందరికి విద్య చట్టం కింద ప్రైవేట్ స్కూల్స్ లోని 25శాతం సీట్లను పేద విద్యార్థులకు ఇవ్వాలి.

… చిన్న స్కూల్స్ కు ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేయాలి.

ప్రైవేట్ టీచర్ల బంద్ కు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్, సంక్షేమ స్వచ్చంధ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఏడాదిలో 12 నెలలు ఉంటే.. ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్లకు కేవలం 10 నెలలకు మాత్రమే జీతాలు ఇస్తున్నారని.. ఇది అన్యాయం అంటోంది ఫోరం. 2018, జూలై 18వ తేదీ బుధవారం రాష్ట్రంలోని 12వేల స్కూల్స్ లో పని చేస్తున్న టీచర్స్ అందరూ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Posted in Uncategorized

Latest Updates