పిడికిలి బిగించిన సంధ్య : సినీ ఇండస్ట్రీ.. ఓ మాఫియా రాజ్యం

Pow-Sandhya-Firesసినిమా రంగంలో మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు  POW నాయకురాలు సంధ్య. సినిమా ఇండస్ట్రీని ఆ నాలుగు కుటుంబాల మాఫియా శాసిస్తోంది అన్నారు. కొత్తవాళ్లను ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. చిన్న నిర్మాతలు సినిమా తీస్తే థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. జీవితా రాజశేఖర్ బెదిరింపులకు భయపడేది లేదని.. కేసులు తమకు కొత్త కాదన్నారు సంధ్య.

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. చాలా మంది బాధితులు న్యాయం కోసం పోరాడిన ఘటనలు ఉన్నాయన్నారు. బాధితుల పక్షాన పోరాటం చేసిన ఘనత మాదే అన్నారు సంధ్య. చిన్న నిర్మాతలపై మండలి ఏం చేస్తుందని నిలదీశారు. 24 క్రాఫ్ట్, ఫెడరేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇలాంటి ఎన్నో సంఘాలు ఉన్నాయని.. వాళ్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Latest Updates