పిడుగుపాటుకు చనిపోతే రూ.6లక్షలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం మరో సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. రైతు బీమా పేరుతో 18-59 సంవత్సరాల రైతులు చనిపోతే రూ.5 లక్షల బీమా ప్రకటించిన ప్రభుత్వం..ఇప్పుడు పిడుగుపాటుకు మరణించిన ఎవ్వరికైనా..వయసుతో సంబంధంలేకుండా ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది. రూ. 6లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పిడుగుపాటును ప్రత్యేక విపత్తు కింద పరిగణిస్తూ గురువారం (జూలై-19) ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎవరైనా పిడుగుపాటుకు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో పిడుగుపాటు మరణిస్తే బాధిత కుటుంబాలకు ఆపద్భందు కింద రూ.50వేలు పరిహారమే ఇచ్చేది. దీన్ని రూ.6లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది సర్కార్.

Posted in Uncategorized

Latest Updates