పిడుగు పడి వృద్ధుడు మృతి

15VKDRL15వికారాబాద్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం (ఏప్రిల్-15) వికారాబాద్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడగా.. మద్గుంచిట్టంపల్లికి చెందిన వృద్ధుడు ఎలుక చంద్రయ్య (70) పిడుగు పాటుతో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలోని కొట్టంలో ఉండగా పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. చంద్రయ్యకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అంత్యక్రియల నిమిత్తం రూ. 11వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేట్ మండలంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. దుప్‌చర్ల, మహంతిపూర్ గ్రామాల్లో వడగండ్ల వాన పడటంతో వరిపంటలు దెబ్బతిన్నాయి. మహంతిపూర్‌లో పిడుగు పడి ఎద్దు మృతిచెందింది. అవుశని చంద్రయ్యకు చెందిన ఎద్దును పొలం వద్ద కట్టేసి ఉంచగా మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందింది. భారీ వర్షానికి మండలంలోని దుప్‌చెర్ల సమీపంలో కాగ్నా వాగులో వరద పారింది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల మండలాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. తాండూరు పట్టణంలోని గొల్లచెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

Posted in Uncategorized

Latest Updates