పియానో వాయిస్తున్న 3D రోబోటిక్ హ్యాండ్

రోబోలు అనగానే మనకు వర్క్ చేసేవిగా మాత్రమే కన్పిస్తాయి. అంటాంటి రోబోలు వీనుల విందు చేసే చక్కటి సంగీతాన్ని కూడా అందించగలవని నిరూపించాయి. తమ చేతి వేళ్లతో సరిగమలు పలికిస్తున్నాయి.

మదురమైన సంగీతాన్ని రాబట్టాలంటే పియానోను వాయించాల్పిందే. చేతి వేళ్లు లయబద్దంగా కదిలినపుడు అద్భుతమైన మ్యూజిక్  బయటకు వస్తుంది. మామూలుగా మనుషుల చేతి వేళ్లు సంగీతాన్ని రాబడుతాయి. అయితే.. కేంబ్రిడ్జ్ యునివర్సిటి వాళ్లు తయారు చేసిన 3D రోబోటిక్ ప్రింటెండ్ హ్యాండ్ ద్వారా పియానోను వాయించేలా తయారు చేశారు.

ఇది అచ్చం మానిషి చేయిలాగే ఉంది. దీన్ని మృదువైన, దృడమైన మెటీరియల్స్ తో తయారుచేశారు. ఇది పియానో వాయించడానికి అనువుగా తయారైంది. చేతి వేళ్లు కదల్చకుండా మని కట్టు ద్వారా మాత్రమే పియానో వాయిస్తుంది.

ఈ విషయం పై కేంబ్రిడ్జ్ యునివర్సిటి ఇంజనీర్ జోసీ హుఘ్స్ మాట్లాడారు. చేయి మానవ శరీరంలో అద్భుత భాగమని … దీన్ని తయారు చేయడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. తాము మాత్రం పరిమితులు గల హ్యాండ్ ను తయారు చేయడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. ఈ రోబోటిక్ చేయి మనిషిలా చేతి వేళ్లలాగ కదల్చలేదని… అందుకు మరింత సమయం పడుతుందని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates