పిల్లలకు ఒబెసిటీ పాఠాలు.. పశ్చిమబెంగాల్ విద్యాశాఖ నిర్ణయం

కోల్‌‌‌‌కతా: ఈ మధ్య కాలంలో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. బిజీ లైఫ్‌‌‌‌తో గడుపుతున్న ప్రజెంట్ ట్రెండ్‌‌‌‌లో చాలా మంది ఉద్యోగులు జంక్‌‌‌‌ ఫుడ్‌‌‌‌లు తినడం, వ్యాయామం చేయకపోవడం తదితర కారణాలతో ఒబెసిటీ బారిన పడుతున్నారు. అయితే చిన్నతనం నుంచే పిల్లలు ఊబకాయం బారిన పడకుండా అవగాహన కలిగిస్తే ఈ సమస్యను దూరం చేయొచ్చని పశ్చిమబెంగాల్‌‌‌‌ విద్యాశాఖ భావించింది.

ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రాధాన్యాన్ని తెలిపేలా ప్రైమరీ స్కూల్‌‌ ‌‌ సిలబస్‌‌‌‌లో పాఠ్యాంశాలు  చేర్చాలని నిర్ణయించింది. దీంతో పిల్లల నుంచి వారి తల్లిదండ్రులు కూడా అవగాహన పొందుతారని భావిస్తోంది. దీనికి సంబంధించి నిధులను ప్రభుత్వం  రిలీజ్ చేసింది. చిన్నతనం నుంచే స్టూడెంట్స్ కు విజ్ఞానాన్ని అందించడంతో పాటు పౌష్టికాహారం  తీసుకోవడం, శారీరక శ్రమ వల్ల ఊబకాయాన్ని  ఏవిధంగా అధిగమించవచ్చో తెలిపేలా కొన్ని పాఠాలుంటాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates