పిల్లలు ఆడుకునే ట్యూబ్ పై రిపోర్టింగ్

rainreportingవర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లన్ని జలమయం. ట్రాఫిక్ జామ్. ఇలాంటి న్యూస్ చెప్పేందుకు న్యూస్ రిపోర్టర్లు నానా తిప్పలు పడుతుంటారు. గొడుగు పట్టుకుని, వర్షం నీటిలో నిలబడి, వాహనదారుల మధ్యలోకి వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఓ రిపోర్టర్ వర్షం వార్తను చెప్పడం కోసం వెరైటీగా ఆలోచించాడు పాక్ రిపోర్టర్.

లాహోర్ సిటీలో భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి ప్రభావాన్ని తెలియజేసేందుకు ఓ టీవీ ఛానెల్‌కు చెందిన రిపోర్టర్ వినూత్నంగా ఆలోచించాడు.  టీవీ వీక్షకులను ఆకర్షించేందుకు నడిరోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో తేలియాడే రబ్బర్ ట్యూబ్‌ పై కూర్చొని లైవ్ రిపోర్టింగ్ చేశాడు. పిల్లలు ఆడుకునే ట్యూబ్ పైకి ఎక్కి రిపోర్టింగ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇప్పటికే 5లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు.

వర్షాకాలం కావడంతో భారత్‌ తో పాటు సరిహద్దు దేశాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే తరహాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాకిస్థాన్‌లోని పలు నగరాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ నీటితో మునిగిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates