పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

పెద్దోళ్లకంటే ఎక్కువ సమస్యలు

సరిగ్గా నిలబడలేక.. కూర్చోలేక సతమతం అవుతారు.. కళ్లు పొడిబారిపోతున్నాయ్

మెడ నొప్పి, భుజాలు లాగడం, వెన్నునొప్పి కేేసులు సైతం పెరుగుతున్నాయ్

20–-20–-20 ఫార్ములా పాటించాలి

ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్లపాటు చూడాలి

ఆన్ లైన్ క్లాసులు ఉన్నప్పుడు ఇవ్వడమే బెటర్ అంటున్న నిపుణులు

హాయిగా.. స్కూలుకెళ్లి రోజంతా చదువుకుని, ఆడుకుని సాయంత్రం ఇంటికొచ్చే పిల్లలు.. ఇప్పుడు ఇంట్లోనే ఉండి, ఫోన్‌‌లోనే అవన్నీ చేస్తున్నారు. పొద్దంతా ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు వినడం, బోర్‌‌‌‌ కొడితే గేమ్స్‌‌ ఆడడం. పిల్లలు రోజులో ఎక్కువ టైం ఫోన్‌‌తోనే గడుపుతున్నారు. కేవలం పిల్లల చదువుల కోసమే కొందరు తల్లిదండ్రులు స్మార్ట్‌‌ఫోన్లు కొంటున్నారు. ఫోన్‌‌ ఎక్కువగా వాడితే పెద్దోళ్లకే అనేక హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. మరి పిల్లల పరిస్థితి? పిల్లలకు పెద్దోళ్లకంటే ఎక్కువ సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. అందుకే క్లాసులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ల చేతికి ఫోన్‌‌ ఇవ్వాలంటున్నారు.

ఎక్కువగా వాడితే..

ఇప్పుడు పిల్లలు చాలావరకు ఫోన్‌‌పైనే ఆధారపడుతున్నారు. క్లాసులు వినడం, టీచర్స్‌‌ చెప్పిన అసైన్‌‌మెంట్స్‌‌ సబ్మిట్‌‌ చేయడం.. అన్ని పనులూ స్మార్ట్‌‌ఫోన్‌‌లో చేస్తున్నారు. కానీ.. అదేపనిగా పగలు, రాత్రి ఫోన్‌‌ వాడితే కంటిచూపు సమస్యలు, ఒబెసిటీ, డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు పగలు మాత్రమే ఫోన్ వాడాలి. రాత్రి  ఫోన్ వాడడం వల్ల కళ్లపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఎంత వర్క్‌‌ ఉన్నా ఈవినింగ్‌‌ 6 గంటల్లోపే కంప్లీట్‌‌ చేసుకుని ఫోన్‌‌ పక్కన పెట్టేయ్యాలి. పగలు కూడా కంటిన్యూస్‌‌గా ఎక్కువసేపు వాడకూడదు. ముప్పై నిమిషాలకు ఒకసారి కచ్చితంగా బ్రేక్‌‌ తీసుకోవాలి. స్క్రీన్ ఎక్కువ సేపు చూడాల్సి వచ్చినప్పుడు అప్పడప్పుడు చల్లని నీళ్లతో క‌‌ళ్లు క‌‌డుక్కోవాలి. ఎక్కువ‌‌సేపు కళ్లార్పకుండా ఉంటే కళ్లు పొడిబారిపోతాయి. కాబ‌‌ట్టి ఎప్పుడూ కంటి రెప్పలు ఆడిస్తూ ఉండాలి. 20–-20–-20 ఫార్ములాను కచ్చితంగా పాటించాలి. అంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి, ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువును ఇరవై సెకన్ల పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు కాస్త రిలీఫ్‌‌ దొరుకుతుంది. పిల్లలు రోజంతా ఫోన్‌‌ వాడితే.. మెంటల్, ఫిజికల్ హెల్త్‌‌ దెబ్బతింటుంది. మెడ నొప్పి, భుజాలు లాగడం, వెన్నునొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సరిగ్గా నిల్చులేక, కూర్చోలేక సతమతమవుతారు. కాబట్టి పిల్లలు అవసరానికి మించి ఫోన్‌‌ వాడకుండా చూడాల్సిన భాద్యత తల్లిదండ్రులదే.

 

Latest Updates