పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడంటూ….అమాయకుడ్ని కొట్టి చంపిన గ్రామస్ధులు

chaపిల్లలను అపహరించే వ్యక్తిగా అనుమానించిన గ్రామస్థులు ఓ 40 ఏళ్ల మనిషిని కొట్టిచంపారు. ఛత్తీస్ గఢ్ లోని మంద్రాకల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళలు సైతం పట్టుకుని చావబాదారు. కాల్వ దాటి వెళ్తున్న అనుమానితుడిని అందరూ చూస్తుండగానే తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ ల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా వ్యక్తులంటూ అమాయకులను అకారణంగా చంపేస్తున్న ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో  పిల్నల్ని కిడ్నాప్ చేసే ముఠాలు వచ్చాయంటూ పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates