పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారనుకుని దాడి : హైదరాబాదీలను కొట్టి చంపారు

పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు సామాన్యులు బలవుతున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా ఇలాంటి దారుణ సంఘటన మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని బీదర్‌ లో జరిగింది. హైదరాబాద్‌ కు చెందిన ఓ కుటుంబంపై అక్కడి స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బార్కస్‌ కు చెందిన సల్మాన్‌ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితులను మలక్‌ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితులను ఆస్పత్రిలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల పరామర్శించారు. చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారన్న అనుమానంతో ఈ కుటుంబంపై బీదర్‌ లోని స్థానికులు దాడికి పాల్పడ్డారు. వ్యవసాయ భూములు చూసేందుకు వెళ్లి, అక్కడి పిల్లలకు చాక్లెట్లు పంచడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై అక్కడి 100 మంది స్థానికులు దాడికి పాల్పడ్డారు. వారి కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు అక్కడి పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates