పిల్లల చదువులే ముఖ్యం: సుప్రీం

పిల్లల చదువు కంటే ప్రచారం ముఖ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లౌడ్‌స్పీకర్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగాల్‌ ప్రభుత్వం 2013లో జారీచేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. విద్యార్ధులకు ఆ రెండు నెలలు అతి ముఖ్యమని నివాసగృహాలు, విద్యాసంస్థల సమీపంలో లౌడ్‌స్పీకర్లను నిషేధిస్తూ మమత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీజేపీ పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఎన్నికల ప్రచారం కంటే పిల్లల చదువులే ముఖ్యమని స్పష్టం చేసింది.

Latest Updates