పిల్ల ఏడ దొరుకుతుంది : పెళ్లి కోసం చైనీయుల విదేశీబాట

chinaఅభివృధ్ధిలో ప్రపంచంతో పోటీ పడుతున్న చైనా ఓ విషయంలో మాత్రం వెనకబడిపోయింది. ఆ దేశంలోని యువకులకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది చైనా యువకులు ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. ఉద్యోగం, చదువు పేరుతో విదేశాలకు వెళ్లిన తర్వాత.. అక్కడే స్థిరపడుతున్న చైనా యువకుల్లో 50శాతం మంది ఆయా దేశాల్లోని మహిళలనే పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతుంది. స్వదేశంలో అమ్మాయిల కొరత కూడా కారణం అంటున్నారు నిపుణులు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో ప్రతీ 1000 మంది పురుషులకు 940 స్త్రీల నిష్పత్తి ఉంది. అదే చైనాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు కేవలం 862 మంది స్త్రీల నిష్పత్తి ఉంది.. 1979 లో చైనాలో జనాభా నియంత్రణ కోసం వన్ చైల్డ్ విధానాన్నిఅమలు చేశారు. దీంతో చైనాలో జనాభా నియంత్రణకు మద్దతు లభించింది. అయితే దీని వల్ల చైనాలో భ్రూణ హత్యల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీని ఫలితంగానే స్త్రీ- పురుష నిష్పత్తిలో భారీ అంతరం ఏర్పడింది. దీంతో ఇక్కడి యువకులు వివాహాలు జరగక ఇబ్బందులు పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates