పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : రెండింతలు కానున్న పింఛన్

EPFఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వీరి పెన్షన్ రెండింతలు.. లేదంటే మూడింతలు కానున్నది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్( EPFO ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంప్లాయ్‌మెంట్ పెన్షన్ స్కీం(EPS)లో సభ్యులుగా ఉన్నవారికి ప్రస్తుతం నెలకు కనీసంగా రూ.1,000 పింఛన్‌ ను చెల్లిస్తున్నారు. భవిష్యత్తులో ఇది రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.5 వేల వరకు పెరగనున్నది. EPS-95 కింద 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో 40 లక్షల మంది నెలకు రూ.1500 అంతకంటే తక్కువ చొప్పున పెన్షన్ పొందుతున్నట్టు అంచనా.

ఇందులో భాగంగా పింఛన్ పెంపుదల కోసం ఇటీవల ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది కేంద్ర కార్మికశాఖ. ప్రస్తుతం EPF కింద అందజేస్తున్న పింఛన్ అతితక్కువగా ఉందని, దీన్ని మరింతగా పెంచాలని అభిప్రాయపడింది కమిటీ. కనీస పెన్షన్‌ గా రూ.2 వేలు ప్రకటించాలని, గరిష్ఠంగా రూ.5వేలకు పెంచితే బాగుంటుందని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. పేద కార్మికులకు మెరుగైన పింఛన్‌ ను అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. త్వరలో కార్మికశాఖ ఈ విషయంపై దృష్టిసారించనున్నది అని తెలిపింది ఈపీఎఫ్‌వో కేంద్ర కమిటీ. పింఛన్ పెంపుపై ఈపీఎఫ్‌వో కార్యనిర్వాహక కమిటీ, కేంద్ర కమిటీ రెండురోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఉన్నతాధికారి చెప్పారు. పెన్షన్‌ ను రూ.2వేలకు పెంచితే కేంద్రంపై రూ.3వేల కోట్ల భారం పడనుంది. కేంద్రప్రభుత్వం వద్ద పెన్షన్ ఫండ్ కింద రూ.3 లక్షల కోట్లు ఉన్నట్లు తెలిపింది కార్మికశాఖ.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates