పీక్ స్టేజ్ కు వెళ్లింది : సోషల్ మీడియాపై చెన్నైలో హైఅలర్ట్

social-mediaపిల్లల కిడ్నాప్ అంటూ వాట్సాప్ లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రోజు రోజుకీ ఈ ఫేక్ మెసేజ్ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. నిజం – అబద్ధం ఏంటో తెలుసుకోలేకుండా పోతున్నారు జనం. ఓ వార్త రాగానే అదే నిజం అనుకుని.. అమాయకులను కొట్టి చంపుతున్నారు. జూలై 1వ తేదీ ఆదివారం సాయంత్రం చెన్నైలో సిటీలో జరిగిన రెండు ఘటనలు కలకలం రేపాయి. దీంతో సోషల్ మీడియా వార్తలపై హైఅలర్ట్ ప్రకటించింది తమిళనాడు సర్కార్. తప్పుడు వార్తలను ప్రసారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తోంది.

వాట్సాప్ లో ఫేక్ వీడియోల వ్యవహారం కొనసాగూతూనే ఉంది. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, వీడియోలు సర్క్యూలేట్ అవడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు కదా అని చాక్లెట్ లు కొనిచ్చిన ఓ పెద్దావిడను గతంలో గ్రామస్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఇలా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూ అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఇలాంటి ఘటన మరొకటి చెన్నై సిటీ నడిబొడ్డున తేనెంపట్టులో జరిగింది.

బీహార్ కు చెందిన గోపాల్ సాహు(22), వినోద్ విహారి(25) అనే ఇద్దరు యువకులు బతుకుదెరువు కోసం చెన్నై వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం తేనెంపట్టు ఏరియాలోని నివాసముండే వరలక్ష్మీ అనే మహిళ.. తన కొడుకు అవినాష్(4) ఇంట్లో వదిలిపెట్టి దగ్గర ఉన్న షాపుకి సరుకుల కోసం వెళ్లింది. చిన్నారి అవినాష్ కూడా తల్లిని ఫాలో అవుతూ ఏడుస్తూ రోడ్డుపైకి వచ్చారు. అయితే ఏడుస్తూ రోడ్డుపైకి వచ్చిన చిన్నారికి ఏమైందో పాపం అంటూ.. భాధితుడు గోపాల్ సాహు ఎత్తుకున్నాడు. చిన్నారిని ఎత్తుకోవడం గమనించిన కొంత మంది స్ధానికులు వీళ్లు బీహార్ నుంచి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన ముఠా అంటూ వారిపై దాడి చేశారు. ఆదివారం మహారాష్ట్రలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అంటూ ఐదుగురు అమాయకులను స్ధానికులు గుంపుగా ఏర్పడి కొట్టి చంపేశారు. చెన్నైలో మళ్లీ ఇలాంటి రూమర్స్ పెరగటం, ఇద్దరు వ్యక్తులను స్థానిక ప్రజలు తీవ్రంగా కొట్టి పడేయటం వంటి ఘటనలతో సోషల్ మీడియా వార్తలపై హై అలర్ట్ ప్రకటించింది తమిళనాడు సర్కార్. తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తోంది. పిల్లలను ఎత్తుకెళ్లు ముఠాలు లేవని తమిళనాడు పోలీస్ శాఖ ప్రకటించింది.

 

Posted in Uncategorized

Latest Updates