పీటీఐ చైర్మన్ గా ఎన్నికైన ఎన్.రవి

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(PTI) నూతన చైర్మన్‌ గా ఎన్.రవి(70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. . పీటీఐ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల సమావేశంలో జరిగిన ఎన్నికల్లో రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత చైర్మ‌న్‌ గా ఉన్న‌ ఎక్స్‌ప్రెస్ గ్రూపు చైర్మన్ గోయింకా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించ‌నున్నారు. అమోఘమైన జ్ఞాని, అద్భుతమైన మేధావి చైర్మన్‌ గా రావడం సంతోషకరమని గోయింకా తెలిపారు. రవి రాకతో పీటీఐ గుర్తింపు మరింత రెట్టింపు అవుతుందని గోయింకా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్.రవి గతంలో ద హిందూ దిన‌ప‌త్రిక‌కు ఎడిట‌ర్‌ గా చేశారు. 2006 నుంచి 2008 వరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌ గా చేశారు.చెన్నైలోని భారతీయ విద్యాభవన్ సెంటర్‌ కు ఎన్.రవి ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్‌టిట్యూట్‌ లో ప్రతినిధి సభ్యుడిగా కూడా రవి ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates