పీతాంబర ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇవాళ (సోమవారం,అక్టోబర్-15) దాటియాలో పీతాంబర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. పీతాంబర శక్తిపీఠంలో ఆయన దాదాపు గంటన్నర సేపు గడిపారు. 1979లోనూ ఇంధిరా గాంధీ ఈ ఆలయాన్నిసందర్శించారు. 1984లో ప్రధాని అయిన తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. పీతాంబర ఆలయ ట్రస్టు చైర్మన్‌గా ప్రస్తుతం రాజస్థాన్ సీఎం వసుంధారా రాజే కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates