పుకార్ల.. షికారు : అభిషేకం జలంలో.. శివుని ప్రతిరూపం

godఏపీ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో మహాశివ రాత్రి రోజు అద్భుతం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. సంజామాల మండలం నోస్సం శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు పూజారులు. భక్తులు కూడా ఉదయం నుంచి శివ దర్శనంలో మునిగిపోయారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావటంతో.. ఆలయంలో చిన్నచిన్న శివ లింగాలను ఓ పాత్రలో పెట్టి భక్తులతో జలాభిషేకం చేయించారు. నీటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేశారు. అలా పాత్రలో చేసిన అభిషేకం నీటిలో శివుని జఠాకారం దర్శనం ఇచ్చింది అనే వార్త సంచలనంగా మారింది.

అసలే మహాశివరాత్రి.. అందరూ శివుని తనయత్వంలో ఉన్నారు. ఈ సమయంలో ఇది ఆ నోటా.. ఈ నోటా మండలం అంతా షికారు చేసింది. అంతే నోస్సం శివాలయానికి జనం పోటెత్తారు. తండోపతండాలుగా తరలివచ్చారు. పాత్రలోని జఠాకార రూపం.. శివుని మహిమ అంటూ దండాలు పెట్టేస్తున్నారు. కొంత మంది సైన్స్ వాదులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. అభిషేకం నీటిలో కుంకుమ, పసుపు వేశారని.. అదంతా నీటి అడుగు భాగానికి వెళ్లిందని చెబుతున్నారు. ఏదో ఒక ఆకారంలో కనిపిస్తుందని.. శివరాత్రి కావటంతో శివుడి రూపం అంటూ ప్రచారం చేశారని మండిపడుతున్నారు కొందరు..

Posted in Uncategorized

Latest Updates