పుట్టిన రెండు గంటలకే ఆధార్‌, రేషన్‌ కార్డు, పాస్‌‌పోర్టు

 అహ్మదాబాద్‌‌: పుట్టిన రెండు గంటలకే ఓ చిన్నారికి ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌‌పోర్టు లభించాయి. గుజరాత్‌ కు చెందిన అంకిత్‌, భూమి నాగరాణి దంపతులకు డిసెంబరు 12న పాప పుట్టింది. వెంటనే రమయ అని పేరుపెట్టారు. తన బిడ్డకు గిఫ్టుగా అన్నిరకాల ధ్రువపత్రాలు ఇవ్వాలని అంకిత్‌ ముందుగానే ఆలోచించుకున్నాడు. దీంతో అన్నిరకాల డాక్యుమెంట్లు సిద్ధం చేసి… పాప పుట్టగానే.. డాక్యుమెంట్లను అధికారులకు సమర్పించి రమయ పేరిట ధ్రువపత్రాలు పొందాడు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ‘డిజిటల్‌‌ ఇండియా’ కార్యక్రమంతో తన కూతుర్ని అనుసంధానం చేయాలనుకున్నానని చెప్పాడు. చిన్న ఏజ్ కే ఇలా ‘గుర్తింపు’ పొందిన పాప రమయనే.

Posted in Uncategorized

Latest Updates