పుతిన్ కు ఆత్మీయ స్వాగతం పలికిన మోడీ

శుక్రవారం(అక్టోబర్-5) ప్రారంభం కానున్న భారత్-రష్యా 19వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పుతిన్ కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు భారత్‌ లో పర్యటించనున్నారు .

రష్యా తయారీ ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి క్షిపణుల కొనుగోలుపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. భూతలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవనుంది. 2017 జూన్ 1న చివరిసారిగా భారత్- రష్యా ల మధ్య దైపాక్షిక సదస్సు జరిగింది.

Posted in Uncategorized

Latest Updates