పురిటిలోనే నూరేళ్లు : పుట్టిన పిల్లలకు పాక్ ప్రమాదకర దేశం

ANIపాకిస్తాన్ లో పుట్టడం పసి పిల్లలకు నిజంగానే శాపం అంటోంది యునెస్కో. పుట్టే పిల్లలకు ప్రమాదకరమైన దేశమని అని తేల్చింది. పాక్ దేశంలో పుట్టిన ప్రతి 22 మంది చిన్నారుల్లో నెల రోజులు నిండకుండానే ఒకరు చనిపోతున్నారని యునెస్కో లెక్కలు చెబుతున్నాయి. శిశు మరణాలపై 52 దిగువ మధ్య ఆసియా దేశాలపై సర్వే చేసిన యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రమాదకర దేశాల్లో పాకిస్థాన్‌(45.6) తో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌(42.3), అఫ్గానిస్తాన్(40), సోమాలియా(38.8) దేశాలు ఉన్నాయి. భారత్ లో కూడా పరిస్ధితి ప్రమాదకరంగానే ఉందని యునెస్కో తెలిపింది. భారత్‌లో శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి మంది పుట్టిన చిన్నారుల్లో నెలలోపు మరణాలు) 25.4గా ఉందని తెలిపింది. భారత్ లోని బీహార్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాలు శిశుమరణాలలో అగ్రస్ధానంలో ఉన్నాయని తెలిపింది. కేరళ, గోవా రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు తక్కువగా ఉందని తెలిపింది.

పుట్టిన చిన్నారులకు సురక్షితమైన దేశాల జాబితాలో జపాన్‌ (0.9)మొదటి స్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో ఐస్‌ల్యాండ్‌(1.0), సింగపూర్‌(1.1), ఫిన్‌ల్యాండ్‌(1.2), స్లోవేనియా(1.3) దేశాలు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates