పులితో మంత్రి పోజులు

తమిళనాడు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ ఓ పులితో కలిసి ఉండే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నిరోజుల క్రితం జయకుమార్ ప్రభుత్వ పర్యటనలో భాగంగా థాయ్‌ లాండ్‌ వెళ్లారు. అక్కడి ఓ  జూ పార్కుకు వెళ్లిన సందర్భంలో ఆయన పులిపై చేయి వేసి దాని పక్కన కూర్చొని ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయింది. గతంలో కూడా తాను జయకుమార్‌ అన్ని క్రూరమృగాలతో చనువుగా ఉండే ఫొటోలు, వీడియోలు జయకుమార్‌  ఇప్పుడు విడుదల చేస్తున్నాడు. గతంలో జపాన్‌ వెళ్లిన సందర్భంలోనూ అక్కడి జూ పార్కులో ఓ సింహం పిల్లతో సరదాగా జయకుమార్‌ గడిపారు. జూన్‌ లో జయకుమార్‌ కు నిరసనగా కొంతమంది ఆయన ఇంట్లోకి ఎండ్రకాయలు విడిచిపెట్టి ఆందోళన చేశారు. అయితే నేను సింహం, పులి వంటి అన్నిటిని చూసే ఇక్కడికి వచ్చాను. ఎండ్రకాయలకు భయపడబోను అంటూ ఆయన అన్నారు.

Posted in Uncategorized

Latest Updates