పులి పిల్లను పోలిన పిల్లి పిల్ల

వనపర్తి : వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూర్యాల గ్రామంలో కుర్వ నర్సింహులు పెంపుడు పిల్లి నిన్న(ఆదివారం) ఒక వింత పిల్లకు జన్మనిచ్చింది. అది  అచ్చం పులిపిల్లను పోలి ఉంది. తలతోపాటు కాళ్లు, పాదాలు, గోర్లు పులిపిల్లను తలపిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆశ్యర్యపోయారు. జంతువుల జీవసూచిలో అనేక పరిణామాలు సంభవిస్తుంటాయని అందువల్లనే అప్పుడప్పుడు ఇలాంటి పిల్లలకు జన్మనిస్తుంటాయని చెప్పారు వ్యవసాయ శాస్త్రవేత్త జయరామకృష్ణయ్య. అలా జన్యుమార్పుల్లో భాగంగానే ఇలాంటి పిల్లలు జన్మిస్తుంటాయన్నారు ఆయన.

Posted in Uncategorized

Latest Updates