పులుల్ని కాపాడదాం : హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అవగాహన కార్యక్రమాలు

అంతరించిపోతున్న పులుల్ని కాపాడడమే ధ్యేయంగా పెట్టుకుంది హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ. వన్యప్రాణాల్ని వేటాడుతున్న వారిని గుర్తించి అటవీ అధికారులకు పట్టించడంతో పాటు.. గిరిజనుల్లో, సామాన్య ప్రజల్లో, చిన్నారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఆదివారం(జులై-29) ఇంటర్నేషనల్ టైగర్ డేని పురస్కరించుకొని కేబీఆర్ పార్క్, జూపార్క్ లో స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాల్ని చేపట్టింది.

ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహిస్తోంది హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ. సెలబ్రేషన్స్ లో భాగంగా కేబీఆర్ పార్క్, జూ పార్క్ లో వివిధ కార్యక్రమాలు చేపట్టింది. సిటీలోని స్కూల్ విద్యార్థులకు పులలు ఎలా అంతరిస్తున్నాయో వివరించడంతో పాటు.. వాటి సంరక్షణ గురించి, పులలతో లభించే లాభాల గురించి వివరించారు.

హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీతో వన్యప్రాణుల గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నామని చెప్పారు విద్యార్థులు. అంతరించిపోతున్న పులులు, అభయారణ్యాలను కాపాడుకోవటంతో వన్య సంపద కూడా పెరుగుతుందన్నారు.

సెలబ్రేషన్స్ లో చిన్నారులు వేసిన పులివేశాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకి వైల్డ్ లైఫ్ పై క్విజ్ పోటీలు కండక్ట్ చేయడంతో పాటు పులులకు సంబంధించిన ఫొటో ఎగ్జీబిషన్ ఏర్పాటు చేశారు సోసైటీ సభ్యులు.

Posted in Uncategorized

Latest Updates