పుషప్స్ తీసి…ప్రశంసలందుకొన్న త్రిపుర సీఎం

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఇప్పుడు… పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. ఓ మీడియా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో… విసిరిన సవాల్‌ ను బిప్లబ్ స్వీకరించి 45 పుషప్స్ తీశారు సీఎం. బిప్లబ్ ఫిట్‌నెస్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఇండియా టుడే కాంక్లేవ్ ఆస్ట్- 2018 కార్యక్రమంలో బిప్లబ్ సహా కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, రాజ్యవర్ధన్ రాథోడ్ పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగా విప్లవ్ శారీరకంగా చాలా దృఢంగా ఉంటారని అన్నారు. ఆయన ఒక నిమింలో 150 పుషప్స్ చేస్తారని చెప్పారు. తనతో పాటు పుషప్స్ తీయాలని బిప్లబ్ కు మెంటార్ ఛాలెంజ్ విసిరారు. దీన్ని అంగీకరించిన బిప్లబ్.. మెంటార్‌‌ తో కలిసి పుషప్స్ తీయడం ప్రారంభించారు. కొద్ది సెకన్లలోనే 45 పుషప్స్ తీశారు.

Posted in Uncategorized

Latest Updates