పుస్తకాల బ్యాగ్ బరువుపై ఆంక్షలు : రెండో తరగతి వరకు నో హోం వర్క్

SSSస్కూల్‌ బ్యాగుల బరువు.. చిన్నారి విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాసంస్థల తీరుపై మండిపడుతూ.. స్కూల్ విధానంపై సంచలన తీర్పునిచ్చింది. విద్యార్థులు వెయిట్ లిఫ్టర్లు కాదు.. స్కూల్‌ బ్యాగుల కోసం కంటైనర్లు కావాలా ఏంటీ అంటూ జస్టిస్‌ కిరుబకరన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చిన్న పిల్లలు తీసుకెళ్తున్న స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సూచించారు. CBSE విద్యార్థులకు రెండో తరగతి వరకు హోం వర్క్‌ ఇవ్వొద్దని సూచించింది. విద్యార్థుల బరువులో.. పిల్లలు మోస్తున్న పుస్తకాల బ్యాగ్ బరువు 10శాతం మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

తీర్పు వెల్లడించిన మద్రాస్ హైకోర్టు.. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చింది. ఈ తీర్పును పాఠశాలు, విద్యాసంస్థలు పాటించేలా CBSE ప్లైయింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. నో-హోంవర్క్ రూల్‌ను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇదే విషయంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని NCERTతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అనుమతి లేని బుక్స్ ను నిషేధించేలా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది.

Posted in Uncategorized

Latest Updates