పూరి గుడిసె బాట : పింఛన్ ఇచ్చి.. అవ్వకి బువ్వ పెట్టిన కలెక్టర్

hpఎవ్వరూ తోడు లేరు. ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఎలాగున్నావ్ అని పలకరించేవాళ్లు లేకపోయినా గుండె ధైర్యంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న ఆ అవ్వకు నేనున్నానని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. అంతేకాదు స్వయంగా ఆమె ఇంటికి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టాడు. అందరి హృదయాలను గెల్చుకున్న ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కరూర్ జిల్లా చిన్నమనాయకన్ పట్టికి చెందిన రాఘమ్మాళ్ వయస్సు 80 ఏళ్లు. నా అన్నవారు ఎవరూ లేరు. ప్రభుత్వం ప్రతినెలా వృద్ధాప్యం ఫింఛనర్ ఇస్తోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన ఎండలతో బయటకు వెళ్లలేకపోతోంది. కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించక  పింఛను తీసుకోవడానికి వెళ్లలేకపోయింది. ఈ  విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అన్ బజగాన్.. ఏప్రిల్ 3వ తేదీ స్వయం తనే ఆమె ఇంటికి వెళ్లారు. ఫించన్ డబ్బులను ఆమె చేతిలో పెట్టారు. అంతే కాకుండా తను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనంను ఆమెకు కూడా వడ్డించారు. అరటి ఆకులో వేసి.. అందులో అవ్వకి కూడా బువ్వ పెట్టారు. ఆ అవ్వకు తనే స్వయంగా తినిపించారు. నీకు నేనున్నాను.. ఏ కష్టం వచ్చినా నా దగ్గరకి వచ్చేయండి అంటూ అవ్వకి భరోసా ఇచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు అందరి హృదయాలు గెలుచుకుంది. గొప్ప హృదయం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates