పూరీ జగన్నాథస్వామిని దర్శించుకున్న కేసీఆర్

భువనేశ్వర్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా గులాబీ బాస్….KCR రాష్ట్రాల పర్యటన కొనసాగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి…సోమవారం ఉదయం పూరీ జగన్నాథస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గరకు చేరుకున్న సీఎం కేసీఆర్ కు అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

బీజేపీయేతర ఫ్రంట్ లక్ష్యంగా రాష్ట్రాల టూర్ కు వెళ్లిన సీఎం కేసీఆర్ నిన్న….భువనేశ్వర్ లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వెళ్లనున్నారు. అక్కడ మమతా బెనర్జీతో భేటీ కానున్నారు కేసీఆర్.

డిసెంబర్- 25 నుంచి రెండు, మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు గులాబీ బాస్. ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ భేటీ అవుతారు. యూపీ మాజీ CMలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ తో భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ర్టానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు KCR.

Posted in Uncategorized

Latest Updates