పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి

mahender-reddyతెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇంచార్జి డీజీపీగా ఉన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఫైల్ పైన సీఎం కేసీఆర్ సంతకం చేశారు. డీజీపీని నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం డీజీపీగా మహేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం వాసి. ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలలో చదివారు.

Posted in Uncategorized

Latest Updates