పూర్తి సబ్సిడీపై వాహనాలు : దివ్యాంగులకు కేసీఆర్ సర్కార్ చేయూత

బంగారు తెలంగాన దిశగా పయనమవుతున్న తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలురకాల సబ్సిడీలతో బర్రెలు, గొర్రెలు, ట్రాక్టర్లు, మత్య్సకారులకు టూవీలర్లు ఇస్తుండగా..ఇప్పుడు దివ్యాంగుల కోసం పూర్తి సబ్సిడీతో టూవీలర్ వాహనాలను ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంతకుముందు ఇంతకుముందు ప్రభుత్వాలు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిల్స్ మాత్రమే ఇచ్చేవి. వీటితో నానా అవస్థలు పడుతున్నట్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు దివ్యాంగులు. ఈ క్రమంలోనే దివ్వాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎక్కడైకైనా ప్రయాణించాలనే ఉద్దేశంతో త్రీవీలర్ బైక్స్, స్కూటర్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. వీటిని మొదటి విడతగా 2వేల వాహనాలను జూలై 28న పంపిణీ చేయనున్నారు.

వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం (జూలై-28) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. 500 మంది దివ్యాంగులకు మోటరుసైకిళ్లను పంపిణీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న వారికి తొలి ప్రాధాన్యంగా వాహనాలు పంపిణీ చేయనున్నారు. గురువారం (జూలై-26) వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎండీ బీ శైలజ టీవీఎస్ షోరూం గోదాంకు వెళ్లి మోటరుసైకిళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు పలు సూచనలు జారీచేశారు. వాహనాలపై సీఎం కేసీఆర్ ఫొటో, ప్రభుత్వ లోగో ఉంటాయి. ఒకేసారి 500 వాహనాలను దివ్యాంగులకు అందజేస్తారు. ఇప్పటికే జిల్లాలవారీగా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు.

Posted in Uncategorized

Latest Updates