పూలే మార్గంలోనే సమానత్వం : మంత్రి మహేందర్ రెడ్డి

mahenderreddyమహాత్మా జ్యోతిబా పూలే మార్గాన్ని ఆచరించి మహిళా వికాసం, సాంఘిక సమానత్వం సాధించి సమ సమాజాన్ని నిర్మిద్దామన్నారు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి. పూలే 192వ జయంతి సందర్భంగా బుధవారం పరిగిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు పూల మాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా భారత సమాజంలోని కుల వివక్షపై ఉద్యమించిన ధీశాలి పూలే అని కొనియాడారు. అంటరానితనం నిర్మూలన, స్త్రీ విద్య, కులాంతర వివాహాలను ప్రోత్సహించి ప్రజా చైతన్యం కల్పించిన యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ మహేష్ రెడ్డి, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates