పృథ్వి-2 ప్రయోగం విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన అణుక్షిపణి పృథ్వి-2 రాత్రి (శనివారం,అక్టోబర్-6) ప్రయోగం విజయవంతమైంది. ఒడిషాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి సైనికాధికారులు దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. 350 కిలో మీటర్ల వేగంతో ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని మొబైల్‌ లాంచర్‌ను వినియోగించి శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ప్రయోగించారు. 500 నుంచి 1000 కిలోల బరువున్న వార్‌హెడ్స్‌ను మోసుకుపోగల ఈ క్షిపణిలో రెండు ఇంజన్లు ఉంటాయని డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. లక్ష్యాలను ఛేదించడంలో అధునాతన సాంకేతికతను వినియోగించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పృథ్వి-2ను రాత్రి వేళలో విజయవంతంగా ప్రయోగించారు.

 

Posted in Uncategorized

Latest Updates