పెండ్లిండ్లు, టూర్​లకు ఇచ్చే బస్సుల కిరాయి తగ్గించిన ఆర్టీసీ

శుభకార్యాలు, టూర్ల కోసంమరూల్స్​ మార్పు

కిలోమీటర్ ప్రాతిపదికన చార్జీలకు స్వస్తి

ఇకపై బస్సు టికెట్ చార్జీపై 50% అదనంగా వసూలు

రీఫండబుల్ డిపాజిట్, స్లాట్ సిస్టమ్ కూడా రద్దు

హైదరాబాద్, వెలుగు: అద్దె బస్సుల చార్జీలను ఆర్టీసీ భారీగా తగ్గించిం ది. ప్రజలను ఆకర్షించేందుకు, ఆదాయం పెం చుకునేం దుకు రూల్స్​ను సడలించింది. శుభకార్యాలు, పెండ్లిండ్లు , టూర్లకు ఇచ్చే అద్దె బస్సులకు చార్జీలు తగ్గిస్తూ ఆర్టీసీ అధికారులు సర్కు లర్ జారీ చేశారు. గతంతో పోలిస్తే ఈ సడలింపులు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇప్పటిదాకా ఇలా ప్రజల అవసరాల కోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తుంటుంది. పెండ్లిండ్లు , శుభకార్యాలు, టూర్లు, తీర్థయాత్రల కోసం జనం బస్సులను బుక్ చేసుకుం టారు. ఇప్పటి దాకా అద్దె బస్సులను కిలోమీటరు ప్రాతిపదికన ఇచ్చేవారు. పల్లెవెలుగుకు కిలోమీటర్ కు రూ.40, ఎక్స్ ప్రెస్​కు రూ.46, సూపర్ లాగ్జరీ, ఏసీ బస్సులకు రూ.52 చొప్పున తీసుకునే వారు. ఇందుకోసం ముందస్తుగా రీఫండబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకునేవారు. రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ట్రిప్ ముగిశాక వెయిటింగ్ , ఇతర చార్జీలు పోగా మిగిలినవి తిరిగి ఇచ్చేవారు.

కొత్త చార్జీలు ఇలా..

ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షించేం దుకు ఆర్టీసీ రూల్స్​ను సడలించింది. ఇకపై కిలోమీటర్ల ప్రాతిపదికన కాకుం డా ప్రస్తుతం ఉన్న చార్జీకి హాఫ్ పర్సెంట్ ఎక్కువ(సీటింగ్ కెపాసిటీపై సాధారణ చార్జీలకు 50 శాతం అదనం)గా తీసుకోనున్నారు. రీఫండబుల్ ఫిక్స్డ్ డిపాజిట్, స్లాట్ సిస్టమ్ కూడా రద్దు చేశారు. దీని ద్వారా అదనంగా చెల్లిం చాల్సిన కిలోమీటర్ టైం చార్జీలు రద్దయ్యాయి. బస్సు తిరిగిన కిలోమీటర్లకు మాత్రమే చార్జీ వర్తిస్తుంది.

పికప్ అండ్ డ్రాప్ సిస్టమ్ ..

పికప్, డ్రాప్ విధానం ద్వారా ప్రయాణ పరిధిని 200 కిలోమీటర్లలోపు వరకు పెంచారు. ప్రయాణికులను కావాల్సిన చోట దింపి , మళ్లీ తిరుగు ప్రయాణానికి నిర్దేశించి న సమయంలో వచ్చి సేవలు అందిస్తారు. పికప్, డ్రాప్ విధానం పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు కూడా వర్తిం పజేశారు. (రాను.. పోను కలిపి) గతంలో స్లాబ్ విధానంలో అధికంగా చెల్లించాల్సి వచ్చేది. 200 కిలోమీటర్లపైన ప్రయాణాలకు ఎక్స్ ప్రెస్ బస్సులకు సాధారణ చార్జీలు తీసుకుంటారు. పల్లె వెలుగుకు సాధారణ చార్జీలకు అదనంగా 10% చార్జీలు ఉంటాయి. సూపర్ లగ్జరీ బస్సులకు 300 కిలోమీటర్లు తిరిగితే సాధారణ చార్జీలు వర్తిస్తాయి. ఏసీ బస్సులు అయితే 400 కిలోమీటర్లకు సాధారణ బస్ చార్జీలు ఉంటాయి. నిర్ణీత సమయానికి మించి బస్సు అదనంగా వేచి ఉంటే గంటకు 300 చొప్పున వెయిటింగ్ చార్జీ వేస్తారు.

 

Latest Updates