పెంపుడు జంతువుల కోసం GHMC పెట్ పార్క్

PARKకొందరు పెంపుడు జంతువులను సొంత బిడ్డల్లా చూసుకుంటారు. వాటితో సరదాగా గడపడం… వాటిని పార్కుకు తీసుకెళ్ళాలంటే మాత్రం సిటీలో కష్టమే. అందుకే పెంపుడు జంతువుల కోసం పార్కులు ఉండాని GHMCని కోరారు పెట్ లవర్స్. దీంతో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే మొదటిసారిగా పెట్ పార్కు రాబోతుంది. జంతువులతో వాకింగ్ కు పోవడానికి ఇబ్బంది అవుతోందని…. పెట్ లవర్స్ అంతా జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చారు. వాటికంటూ సెపరేట్ పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో గచ్చిబౌలి హౌసింగ్ బోర్డ్ కాలనీలో.. ఎకరంన్నర స్థలంలో పెట్ పార్క్ రెడీ చేస్తున్నారు. ఈ ఏప్రిల్ లోనే ఇది అందుబాటులోకి రానుంది.

కుక్కల కోసం ప్రత్యేకంగా ఆల్ జీబ్రా ర్యాంప్, చిన్న పెద్ద కుక్కలకు సెపరేట్ గా జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్క్ లాగా కాకుండా.. వీటికి కూడా ఆట వస్తువులు, శిక్షణ ఇచ్చే స్థలం….. ఇలా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కుక్కలతో పాటు పిల్లులను కూడా ఈ పార్కులోకి తీసుకురావొచ్చు. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ పెట్ పార్క్ రెడీ అవుతోంది.

ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలా పెట్ పార్క్ లేదు. నగరంలో ఇది అందుబాటులోకి వస్తే.. దేశంలోనే మొదటి పెట్ పార్క్ అవుతుంది. విదేశాల్లో అయితే.. జనానికి లాగానే పెంపుడు జంతువులకీ పార్కులుంటాయి. నగరంలో ఏర్పాటు చేసే ఈ పెట్ పార్కులో ఎంట్రీ ఫ్రీగానే ఉంటుందంటున్నారు అధికారులు. లోపల ఎక్విప్ మెంట్ ని ఉపయోగిస్తే.. ఛార్జ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ పార్క్ లో ట్రైనర్ తో పాటు, వెటర్నరీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు. రెస్పాన్స్ బాగుంటే సిటీలో మరిన్ని పెట్ పార్కులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది బల్దియా.

Posted in Uncategorized

Latest Updates