పెట్టాపేడా సర్దేయటమేనా : లక్ష మంది NRIలకు ట్రంప్ దెబ్బ

trump
అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో లక్షమంది ప్రవాస భారతీయులు కొలువులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో హెచ్‌1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్‌ పర్మిట్‌ ను రద్దుచేయాలనే ఆలోచనతో ఉంది ట్రంప్ సర్కార్. అమెరికా ప్రభుత్వం తాజా ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా, వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుంది.

ట్రంప్‌ సర్కార్‌  వీసా విధానాన్ని కఠినతరం చేస్తే కలిగే నష్టం గురించి టెన్యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్‌ జే.ఎల్‌. కన్నింగమ్,యూనివర్సిటీ ఆఫ్‌ లైమ్‌రిక్‌లో కెమ్మి బిజినెస్‌ స్కూలుకి చెందిన పూజ బి విజయ్‌కుమార్‌లు  1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో మాట్లాడి ఓ అధ్యయన నివేదికను రూపొందించారు. ఆ అధ్యయన నివేదిక ప్రకారం లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారు. ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలు కోల్పోతారు.

వర్క్‌ పర్మిట్‌ పొందినవారిలో  93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్‌ దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్‌ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూవీసా నిబంధనలు  కఠినతరం చేశారు. అందులో భాగంగా హెచ్‌4 వీసాను రద్దు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది అమెరికా ప్రభుత్వం. వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌ ప్రణాళికలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి గూగుల్, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు.

Posted in Uncategorized

Latest Updates