పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా ఎత్తేస్తాం.. బీజేపీ

హైదరాబాద్ : హైదరాబాద్ లో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ NVSS ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తమ లక్ష్యమని…. మద్యపాన నియంత్రణ దిశగా తీసుకోబోయే చర్యలు మేనిఫెస్టోలో ఉంటాయని అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం అమ్మకాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. బార్లను సాయంత్రం ఆరు గంటలకు మూసేస్తామన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఎంతో మంది జీవితాలను మద్యం మహమ్మారి నాశనం చేస్తుందని.. మద్యపాన నియంత్రణ చేయాలని నిర్ణయించామన్నారు.

జాతరకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. హనుమాన్, అయ్యప్ప, అమ్మవారి దీక్ష చేసేవారు దీక్ష ముగిసి ఆలయాలకు వెళ్ళే వారికోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. వక్ఫ్, ఎండోమెంట్, క్రైస్తవ దేవాలయాల భూముల పరిరక్షణ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నిరుద్యోగులకోసం ఆన్ లైన్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ పంచాయితీ నుండి గ్రేటర్ మున్సిపాలిటీ వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత, హెల్త్ స్కీం అందిస్తామన్నారు.

పెట్రోల్ డీజిల్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వ్యాట్ వసూలు చేస్తోందన్నారు ప్రభాకర్. తెలంగాణ వసూలు చేస్తున్న వ్యాట్ ను బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates