పెట్రోల్ పై భయంకరమైన నిజం : GSTలోకి తీసుకొచ్చినా అవే ధరలు

pppపెట్రలో, డీజిల్ ధరలు ఇటీవల కాలంలో రోజు రోజుకీ పెరుగుతూ వాహనాదారులకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అయితే వీటిని GST పరిధిలోకి తీసుకురావాలని, అప్పుడే ధరలు అదుపులో ఉంటాయని వినియోగదారుల నుంచి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా పెట్రోల్, డీజిల్ ను GST పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి.  అయితే అసలు వీటిని GST లోకి తీసుకొస్తే వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం సృష్టతనిచ్చింది.

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకొచ్చినప్పటి అవి పూర్తిస్థాయి జీఎస్టీ పరిధిలోకి రావని, 28శాతం జీఎస్టీ తో పాటు లోకల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ లేదా వ్యాట్‌ కూడా ఉండే అవకాశాలున్నాయని, అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే టాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లీటర్‌ పెట్రోల్‌ పై ప్రస్తుతం కేంద్రం రూ. 19.48, లీటర్‌ డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తుంది. దీంతో పాటు రాష్ట్రాలు వ్యాట్‌ ను కూడా విధిస్తున్నాయి. డీజిల్‌ పై తెలంగాణలో అధికంగా 26శాతం వ్యాట్ విధిస్తుండగా, పెట్రోల్‌ పై ముంబయిలో అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ ని విధిస్తున్నారు. ఇక అండమాన్‌ లో తక్కువగా 6శాతం వ్యాట్ ఉంది. మొత్తం పన్నులు కలిపి పెట్రోల్‌ పై 45 నుంచి 50శాతం వరకూ, డీజిల్‌ పై 35 నుంచి 40శాతం వరకూ ఉన్నాయి. వీటిని జీఎస్టీలోకి తీసుకొచ్చినప్పటికీ ధరల విషయంలో పెద్దగా ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రస్తుతమున్న ధరలే ఉంటాయని కేంద్రం తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates