పెట్రో ధరల మంటకు మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కారణం : జైపాల్ రెడ్డి

JAIPALదేశంలో పెట్రో ధరల మంటలకు కారణం మోడీ సర్కార్ నిర్లక్షమే అన్నారు కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి. UPA హయాంలో 100 డాలర్లుగా ఉన్న బారెల్ ధర ప్రస్తుతం 75 డాలర్ల దిగువకు పడిపోయిందనీ, ఈ లెక్కన తగ్గాల్సిన పెట్రోధరలు ఇంకా పెరగడం ఏంటో అర్థం కావడం లేదన్నారు జైపాల్ రెడ్డి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారన్నారు. మధ్యతరగతివారిపై మోడీ యుద్దం చేస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సబ్సీడీల ద్వారా కేంద్రానికి 3 లక్షల 70 వేల కోట్లు లాభం వస్తుందని జైపాల్ రెడ్డి అన్నారు. మోడీ శాడిస్టులా వ్యవహరిస్తున్నరని, ఇంకో ఏడాదిలో మోడీకి మూడుతుందని జైపాల్ రెడ్డి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates